'ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలి'

NRML: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజలు సమర్పించిన అర్జీలను సంబంధిత అధికారులు తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.