కారుణ్య నియామక పత్రాన్ని అందజేసిన ఎస్పీ

కారుణ్య నియామక పత్రాన్ని అందజేసిన ఎస్పీ

PPM: జిల్లా పోలీసు శాఖలో ఆర్మ్డ్ రిజర్వ్ విభాగంలో పనిచేస్తూ ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందిన కానిస్టేబుల్ భార్యకు కారుణ్య నియామక పత్రాన్ని ఎస్పీ మాధవరెడ్డి మంగళవారం అందజేశారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు శాఖలో విధులు నిర్వహించే సిబ్బంది ప్రాణాలు పణంగా పెట్టి పని చేస్తుంటారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఉన్నారు.