చేనేత భవన్.. తుమ్మల ఆకస్మిక తనిఖీ
TG: హైదరాబాద్ నాంపల్లిలోని చేనేత భవన్ కార్యాలయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం 10.30 గంటలకు కార్యాలయానికి చేరుకున్న మంత్రి... కొంతమంది ఉద్యోగులు ఇంకా హాజరుకాలేదని గమనించారు. దీంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన తుమ్మల.. సమయపాలన పాటించని ఉద్యోగులకు మెమోలు జారీ చేయాలని అధికారులకు ఆదేశించారు.