VIDEO: ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేసిన అంగన్వాడీ టీచర్లు
కృష్ణా: గుడివాడ ప్రజా వేదిక కార్యాలయం అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు తమ సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే రాముకు ఈరోజు వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వానికి భిన్నంగా కూటమి ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు,హెల్పర్లకు ఒకటవ తేదీనే జీతాలు అందిస్తుందని అన్నారు. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు.