జానపద, నృత్య పోటీల్లో రాష్ట్ర స్థాయికి ఎంపిక
SRPT: కోదాడ మండల విద్యాధికారి సలీం షరీఫ్, విద్యార్థులు చదువుతో పాటు సాంస్కృతిక కళా రంగాల్లో రాణించడం అభినందనీయమని అన్నారు. శుక్రవారం కోదాడ ఉన్నత పాఠశాలలో జానపద, నృత్య పోటీల్లో రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థినిలను ఆయన అభినందించి, రాష్ట్రస్థాయిలో కూడా రాణించి పాఠశాలకు పేరు తేవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.