పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు

పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు

బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెంలోని జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్సై మర్రి వెంకట శివకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పరీక్షలు రాసే విద్యార్థులు సెల్ ఫోన్లు, కాపీ స్లిప్పులు తీసుకెళ్లకుండా తనిఖీలు నిర్వహించామన్నారు. ఇందులో భాగంగా పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.