రవాణా శాఖ అధికారులు పెన్‌డౌన్

రవాణా శాఖ అధికారులు పెన్‌డౌన్

KNR: జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో డిటిసి పురుషోత్తం ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి రవాణా శాఖ ఉద్యోగులు పెన్‌డౌన్ చేస్తున్నారు. రవాణా శాఖలోని హైదరాబాద్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ పై, ఆటో యూనియన్ నాయకుడు అమానుల్లా ఖాన్ దాడి చేయడానికి నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖ కార్యాలయంలో పెన్‌డౌన్ కార్యక్రమాన్ని చేస్తున్నారు.