ఉద్యాన శాఖ ద్వారా ఎకరాకు 8000 ప్రోత్సాహకం

BDK: జూలూరుపాడు మండలంలో జిల్లా ఉద్యాన అధికారి జంగా కిశోర్ దరఖాస్తు చేసుకున్న రైతు క్షేత్రాలను గురువారం పరిశీలించారు. పూలతోట సాగును చేసే రైతులకు ఉద్యాన శాఖ నుండి రైతులకు ఎకరానికి రాయితీ రూపంలో 8000/- వారి బ్యాంక్ ఖాతాలోకి జమ చేయడం జరుగుతుందన్నారు. బంతి తోట సాగు చేసే రైతుకు ఎకరానికి 4 నుండి 6 టన్నులు దిగుబడి వస్తుందన్నారు.