పాలకొండలో మెగా రక్తదాన శిబిరం
PPM: పాలకొండ మండల కేంద్రంలో ఇవాళ మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. రక్తదానం చేయడం ద్వారా మరొకరికి ప్రాణదాతలు అవుతారన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జానసేనా పార్టీ ఉపాధ్యక్షుడు గర్భాన సత్తిబాబు తదితరులు ఉన్నారు.