'విభిన్న ప్రతిభావంతులు ధైర్యాన్ని కలిగించాలి'
PPM: విభిన్న ప్రతిభావంతులలో దాగి ఉన్న కళలను, ఆటలు, క్రీడలను వెలికితీసి వారిలో ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని నింపాలని జిల్లా రెవిన్యూ అధికారి కె.హేమలత పేర్కొన్నారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ సందర్బంగా జిల్లా స్థాయి ఆటల పోటీలు గురువారం స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో జరిగాయి.