తండ్రికి అంత్యక్రియలు నిర్వహించిన కుమార్తె

ప్రకాశం: అనారోగ్యంతో మృతి చెందిన తండ్రికి కుమార్తె అంత్యక్రియలు నిర్వహించిన ఘటన బుధవారం యద్దనపూడిలో చోటుచేసుకుంది. విశ్రాంత ఉపాధ్యాయుడు సోమేపల్లి తాండవ కృష్ణమూర్తి ( 86 ) అనారోగ్యంతో సోమవారం మృతి చెందాడు. ఆయనకు ప్రసన్న లక్ష్మీ , పవనలత అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొడుకులు లేకపోవడంతో పెద్ద కుమార్తె తండ్రికి అంతక్రియలు నిర్వహించింది.