పుణ్యగిరిలో శివరాత్రి ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

పుణ్యగిరిలో శివరాత్రి ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

PPM: ఎస్.కోట మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పుణ్యగిరిలో శివరాత్రి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి గురువారం పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లు, క్యూ లైన్లు, పార్కింగ్ ప్రదేశాలను తనిఖీ చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని, శివరాత్రి రోజున దర్శనాలకు ఆటంకం కలగకుండా సాఫీగా జరిగేటట్టు చూడాలని ఆదేశించారు.