'తుఫాను వల్ల రూ.72 కోట్ల నష్టం'

'తుఫాను వల్ల రూ.72 కోట్ల నష్టం'

ELR: ఉంగుటూరు నియోజకవర్గంలో కేంద్ర బృందం పర్యటన సోమవారం సజావుగా జరిగిందని కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తుఫాను కారణంగా జిల్లాలో రూ.72 కోట్ల నష్టంతోపాటు, 5,703 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని వివరించారు. రైతుల పొలాలను చూసిన కేంద్ర బృందానికి తుఫాన్ వల్ల ఎంత నష్టం కలిగిందో అర్ధమయిందని చెప్పారు.