VIDEO: అభివృద్ధికి ఆమడ దూరంలో జారుడుబండ

MNCL: జన్నారం శివారులోని ప్రధాన వాగుపై ఉన్న జారుడుబండ ప్రాంతం అభివృద్ధికి దూరంగా ఉంది. చుట్టుపక్కల అభయారణ్యం, పక్షుల కిలకిల రావాల మధ్య జారుడుబండ ప్రాంతం చూడటానికి ఆకర్షనీయంగా ఉంటుంది. ప్రధాన రహదారికి కూత వేటు దూరంలో ఉన్న వాగుపై ఐదు మీటర్ల ఎత్తులో నీరు జాలువారుతుంది. అభయారణ్యాన్ని అభివృద్ధి చేస్తున్న అధికారులు జారుడుబండ ప్రాంతాన్ని పట్టించుకోవడంలేదన్నారు.