పీహెచ్‌సీలో పల్స్ పోలియో ట్రైనింగ్ కార్యక్రమం

పీహెచ్‌సీలో పల్స్ పోలియో ట్రైనింగ్ కార్యక్రమం

NLR: ఈనెల 21న జరగనున్న జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా సీతారామాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈరోజు ట్రైనింగ్ నిర్వహించారు. పుట్టిన శిశువుల నుంచి 5ఏళ్ల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయాలని సూచించారు. బూత్ సిబ్బంది విధులు, వాక్సిన్ వయల్ మానిటర్ పరిశీలన, మార్కింగ్ విధానాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, ఆశాలు పాల్గొన్నారు.