అక్రమ నిర్మాణంపై చర్యలు -ఇల్లందలో బేస్‌మెంట్ కూల్చివేత

అక్రమ నిర్మాణంపై చర్యలు -ఇల్లందలో బేస్‌మెంట్ కూల్చివేత

WGL: వర్ధన్నపేట మండలం ఇల్లందలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ బేస్‌మెంట్‌పై గ్రామపంచాయతీ అధికారులు బుధవారం చర్యలు తీసుకున్నారు. వివేకానంద కాలనీలో సీసీ రోడ్డును ఆనుకొని అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాన్ని జేసీబీ సాయంతో కూల్చివేశారు. ఈ నిర్మాణంపై వారంరోజుల క్రితమే నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో కూల్చివేసినట్లు అధికారులు తెలిపారు.