చింతగూడెంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు
NLG: అనుముల మండలం చింతగూడెంలో మిర్యాలగూడలోని ఓ హాస్పిటల్ సౌజన్యంతో డాక్టర్ మువ్వ రామారావు ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. నిపుణులు రోగులకు గుండె, నరాలు, జీర్ణకోశ పరీక్షలు చేసి సలహాలిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, టీడీపీ నాయకులు పాల్గొని డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. పెద్ద సంఖ్యలో గ్రామస్థులు వైద్య సేవలు పొందారు.