పెంచలకోనలో శ్రీ కృష్ణాష్టమి పూజలు

NLR: రాపూరు మండలంలోని పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో శనివారం కృష్ణాష్టమి పండుగ సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. స్వామి అమ్మవార్లు కు అభిషేకం తదితర పూజా కార్యక్రమాలు జరిగాయి. ప్రత్యేక పుష్ప అలంకరణలో స్వామివారు భక్తులకు దర్శనం ఇచ్చారు. చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి భక్తుల విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు.