'జిల్లాను నాటు సారా రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి'

'జిల్లాను నాటు సారా రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి'

PPM: నవోదయ 2.0 కింద నాటు సారా రహిత జిల్లాగా పార్వతీపురంను తీర్చిదిద్దాలని జిల్లా రెవిన్యూ అధికారి కె.హేమలత తెలిపారు. సంబంధిత అధికారుల సమష్టి కృషితోనే అది సాధ్యమౌతుందని అన్నారు. జిల్లాకు సమీపంలో ఒడిశా సరిహద్దు ప్రాంతాలు ఉన్నందున అంతర్ రాష్ట్ర తనిఖీలను మరింత విస్తృతం చేయాలని సూచించారు. నాటు సారా తయారీ, విక్రయాలపై పీడీ యాక్టు పటిష్టంగా అమలు చేయాలని పేర్కొన్నారు.