నేడు గురుకుల పాఠశాలలో ఎంజేపీ ప్రవేశ పరీక్ష

నేడు గురుకుల పాఠశాలలో ఎంజేపీ ప్రవేశ పరీక్ష

CTR: పుంగనూరునియోజకవర్గం సదుం మండలంలోని ఎంజేపీ గురుకుల పాఠశాలలో బ్యాక్ లాగ్ సీట్ల భర్తీ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి ఈనెల 20, 21 తేదీలలో రాత పరీక్ష నిర్వహించనున్నట్టు కన్వీనర్ ప్రిన్సిపల్ శ్రీనివాసులరెడ్డి బుధవారం తెలిపారు. 6, 8 తరగతులకు 20న, 7, 9 తరగతులకు 21న మధ్యాహ్నం 3గంటల నుంచి పరీక్ష ప్రారంభం అవుతుందన్నారు.