రఫీని ఎవరు హత్య చేయించారో చెప్పాలి: ఫయాజ్

NLR: బుచ్చి మండలం పోలినాయుడు చెరువుకు చెందిన తన మామ రఫీ హత్య కేసును తప్పుదారి పట్టిస్తున్నారని ఆయన మేనల్లుడు ఫయాజ్ ఆరోపించారు. కేసు పురోగతిపై తమకు ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదని వాపోయారు. హత్యను ప్రోత్సహించిన వారి వివరాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి చొరవ తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు.