రూ.50.06కోట్ల వ్యయానికి తగ్గ ప్రతిఫలం ఏది?: శివాజీ

కృష్ణా: G20 సభల సందర్భంగా ప్రధాని మోదీ బహిరంగ ప్రకటనలకై రూ.50.06కోట్ల ఖర్చు అయిందని PCC వైస్ ప్రెసిడెంట్ కొలనుకొండ శివాజీ అన్నారు. ఇన్ని ప్రకటనలిచ్చినా IMFలో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ఓట్లు పొందడంలో దేశం విఫలమైందని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ప్రకటనల కోసం రూ.కోట్ల వ్యయమైనప్పటికీ దేశానికి సరైన ప్రతిఫలం దక్కలేదని దుయ్యబట్టారు..