ఏడాదిలోగా డిజిటల్ హెల్త్ రికార్డులు: సీఎం

ఏడాదిలోగా డిజిటల్ హెల్త్ రికార్డులు: సీఎం

ఏడాదిలోగా రాష్ట్ర ప్రజలందరి డిజిటల్ హెల్త్ రికార్డులు సిద్ధం చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. వీటి ద్వారా టాప్-10 రోగాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకుంటామన్నారు. జబ్బు వచ్చాక ఆసుపత్రుల చుట్టూ తిరగడం కంటే.. రాకుండా చూసుకునే 'ప్రివెంటివ్ హెల్త్ కేర్' బెటర్ అని చెప్పారు. పలువురు వైద్య నిపుణులతో జరిగిన మీటింగ్‌లో సీఎం ఈ విషయాలు వెల్లడించారు.