'విద్యార్థులు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి'

'విద్యార్థులు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి'

CTR: విద్యార్థులందరూ భోజనానికి ముందు, తరువాత అలాగే, బాత్రూం వెళ్లి వచ్చాక తప్పకుండా చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని పలమనేరు మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి సూచించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసి, భోజన నాణ్యత మరింత మెరుగ్గా ఉండాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, హెచ్ఎం శంషీర్ పాల్గొన్నారు.