ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే

ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే

KKD: సామర్లకోటలో శుక్రవారం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ప్రజా దర్బార్ నిర్వహించారు. గౌడ్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ బుడుగు శ్రీకాంత్ కార్యాలయంలో ఆయన ప్రజల నుంచి వినతి పత్రాలు సేకరించారు. పింఛన్లు, ఇళ్ల స్థలాలు, ఇతర వ్యక్తిగత సమస్యలపై 22 మంది వినతులు అందించినట్లు రాష్ట్ర కార్యదర్శి రాజా సూరిబాబు రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.