'రక్తదానం ఒక గొప్ప మానవీయ సేవ'

'రక్తదానం ఒక గొప్ప మానవీయ సేవ'

KMM: నగరంలోని 18వ డివిజన్ ముస్తఫానగర్ పట్టణ ఆరోగ్య కేంద్రం నందు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, వికాస తరంగిణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని శుక్రవారం నగర మేయర్ పునుకొల్లు నీరజ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రక్తదానం ఒక గొప్ప మానవీయ సేవ అని అన్నారు. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి రక్తదానం చేస్తే అనేక ప్రాణాలను కాపాడవచ్చన్నారు.