అగ్నిగుండంలో పడ్డ 10 మంది భక్తులు
TG: నల్గొండ జిల్లా ఆమనగల్లు శ్రీపార్వతీరామలింగేశ్వరస్వామి ఉత్సవాల్లో విషాదం నెలకొంది. భక్తులు అగ్నిగుండం దాటుతుండగా ఒక్కసారిగా తొక్కిసలాట జరగడంతో, ఒకరినొకరు నెట్టుకుని 10 మంది భక్తులు నిప్పుల గుండంలో పడిపోయారు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే వారిని మంటల నుంచి బయటకు లాగి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో ఉత్సవాల్లో ఒక్కసారిగా భయాందోళనలు వ్యక్తమయ్యాయి.