మీడియా ఛానళ్లపై మాజీమంత్రి ఫైర్
AP: పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదికపై కొన్ని మీడియా ఛానళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మాజీమంత్రి విడదల రజిని మండిపడ్డారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వం సిద్ధమా? అని సవాల్ విసిరారు. పేదల ఆరోగ్యంపై చంద్రబాబుకి చిత్తశుద్ధి లేదని విమర్శించారు.