శుభకార్యానికి వెళ్లి వస్తూ ప్రమాదం.. ఒకరు స్పాట్ డెడ్
కృష్ణా: మచిలీపట్నం జాతీయ రహదారిపై ఉయ్యూరు వద్ద ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందగా 7గురి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం. మండపల్లి(M) కానుకొల్లు గ్రామానికి చెందిన 8 మంది HYDలోని ఓ శుభకార్యానికి వెళ్లారు. తిరిగి స్వగ్రామానికి వస్తుండగా వీరి కారు రోడ్డు పక్కన ఉన్న స్తంభాన్ని ఢీకొట్టింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.