'మళ్లీ రీపోలింగ్ నిర్వహించాలి'
JGL: వెల్గటూర్ మండలం పైడిపల్లి గ్రామంలో జరిగిన ఘటన నేపథ్యంలో మళ్లీ రీపోలింగ్ నిర్వహించాలని ఓడిన అభ్యర్థి తరఫున వర్గాలు డిమాండ్ చేశాయి. ఓట్ల లెక్కింపులో భారీ అవకతవకలు జరిగాయని వారు ఆరోపించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వారు పోలీసులు మహిళలని కూడా చూడకుండా లాఠీఛార్జ్ చేసి గాయపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు.