ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు ప్రోత్సహాలు

ప్రకాశం: పదో తరగతి, ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన గిరిజన గురుకులాల విద్యార్థులకు కొండేపి ఎమ్మెల్యే, మంత్రి బాలవీరాంజనేయస్వామి నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో విద్యార్థులను అభినందించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో కార్పొరేట్ స్థాయి ఫలితాలు సాధించడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని ఆయన అన్నారు.