'పరిశుభ్రతను పాటించాలి'

'పరిశుభ్రతను పాటించాలి'

ADB: వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు తమ ఇంటి పరిసర ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని HEO పవార్ రవీందర్ అన్నారు. శుక్రవారం నేరడిగొండ మండలంలోని కోర్టికల్ గ్రామంలో ఉచిత వైద్య శిభిరాన్ని నిర్వహించారు. అనంతరం గ్రామస్థులకు వైద్య పరీక్షలు చేసి సంబంధిత మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంతోష్, నర్సయ్య, నరేందర్ రెడ్డి, ఆత్రం నగేష్, గంగామని తదితరులున్నారు.