'ప్రతి ఇంటిపైనా తిరంగా జెండా ఎగరాలి'

'ప్రతి ఇంటిపైనా తిరంగా జెండా ఎగరాలి'

ATP: ప్రతి ఇంటిపై తిరంగా జెండా ఎగరేయాలి, జాతీయ వాద భావజాలంతో పని చేయాలని నియోజకవర్గ బీజేపీ ఇంఛార్జ్ కొనకొండ్ల రాజేష్ పిలుపునిచ్చారు. మంగళవారం ఉరవకొండ పట్టణంలో బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించిన 'హర్‌ ఘర్‌ తిరంగా' యాత్రలో పాల్గొన్నారు. ముందుగా జూనియర్ కళాశాల నుంచి టవర్‌ సర్కిల్‌ వరకు పాదయాత్రగా వెళ్లారు.