ఉత్తరాది రాష్ట్రాల్లో వర్ష బీభత్సం

ఉత్తర భారతంలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా రాజస్థాన్‌లో ఆరుగురు మృతి చెందారు. దౌసాలో 29 సెం.మీ వర్షపాతం, జమ్మూలో 24 గంటల్లో 19 సెం.మీ. వర్షపాతం నమోదైంది. హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ వర్షాల కారణంగా హైవేలు మూసివేశారు. పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్‌లో కుండపోత వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.