కేఎల్ఐ కాలువ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

NGKL: రైతుల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. అచ్చంపేట నియోజకవర్గం బల్మూరు మండలం గట్టు తుమ్మెద గ్రామం వద్ద కేఎల్ఐ కాలువ నుండి రామన్ పాడు పంప్ హౌస్ ద్వారా సాగునీరు అందించేందుకు జరుగుతున్న పనులను ఆయన మంగళవారం పరిశీలించారు.