అనారోగ్యంతో ఫీల్డ్ అసిస్టెంట్ మృతి

అనారోగ్యంతో ఫీల్డ్ అసిస్టెంట్ మృతి

VZM: తెర్లాం మండలం లింగాపురానికి చెందిన ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ ఆర్నిపల్లి శివరాంనాయుడు ఇవాళ అనారోగ్యంతో మృతి చెందారు. కొన్ని రోజులుగా చికిత్స పొందుతూ పోరాడిన ఆయన చివరకు కన్నుమూశారు. అందరితో స్నేహంగా మెలిగే ఆయన మృతితో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి.