VIDEO: డాన్స్ చేసిన ఎమ్మెల్యే నాగరాజు

WGL: వర్ధన్నపేట MLA కెఆర్ నాగరాజు డాన్స్ చేశారు. నియోజకవర్గ పరిధిలోని గుండ్ల సింగారం పోలీస్ కాలనీ వాటర్ ట్యాంక్ వద్ద సేవాలాల్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గురువారం రాత్రి తీజ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో MLA ముఖ్యఅతిథిగా పాల్గొని, స్థానిక మహిళలు, బంజారాలతో కలిసి MLA నృత్యం చేశారు. గిరిజన సంస్కృతీ, సంప్రదాయాలకు తీజ్ వేడుకలు ప్రతీకలన్నారు.