'వేసవిలో అప్రమత్తంగా ఉండాలి'
GDWL: వేసవి సెలవుల్లో ఊర్లకు వెళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలంపూర్ ఎస్సై రామకృష్ణ సూచించారు. ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేటప్పుడు ఇరుగుపొరుగు వారికి సమాచారం ఇవ్వాలని, విలువైన బంగారం, నగదు ఇంట్లో ఉంచకూడదని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే లేదా దొంగతనం జరిగితే వెంటనే 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.