రెండో విడత జీపీ ఎన్నికలకు సర్వం సిద్ధం: కలెక్టర్
MHBD: జిల్లాలో రెండో విడత జీపీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. బయ్యారం, చిన్నగూడురు, దంతాలపల్లి, గార్ల, నర్సింహులపేట, పెద్దవంగర, తొర్రూరు మండలాల్లోని 158 జీపీలకు ఈ నెల 14న పోలింగ్ జరగనుంది. మొత్తం 460 మంది సర్పంచ్ అభ్యర్థులు, 2,607 మంది వార్డు అభ్యర్థులు బరిలో ఉన్నారు.