పసిపాప ప్రాణాలు తీసిన అతివేగం
KDP: శనివారం రాత్రి జమాలపల్లె వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 ఏళ్ల ఆఫియా తస్లీమా అనే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. తల్లితో కలిసి బంధువుల ఇంటికి వెళ్లేందుకు ఆటో కోసం ఎదురుచూస్తుండగా, రాయచోటి వైపు నుంచి అతివేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.చిన్నారి ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతి చెందింది.