VIDEO: ఉర్దూలో మాట్లాడిన కలెక్టర్
NLR: రంజాన్ పర్వదినం సందర్భంగా కలెక్టర్ హిమాన్షు శుక్లా ముస్లింలకు ఉర్దూ భాషలో ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొన్నప్పటికీ, భారతదేశంలో ఉన్న శాంతి, ఐక్యమత్యమే మన దేశ గొప్పతనమని ఆయన కొనియాడారు.మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దేశంలో భారీగా ఏర్పాటవుతున్న పరిశ్రమల ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు.