ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఎస్పీ

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఎస్పీ

ADB: పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మూడో విడత ఎన్నికల్లో భాగంగా సోమవారం మండల కేంద్రంలో స్పెషల్ పార్టీ బలగాలతో పురవీధుల గుండా మార్చ్ నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో రెచ్చగొట్టేలా పోస్టులు చేయవద్దన్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై  కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.