ఇండస్ట్రియల్ ఏరియాలో విజిలెన్స్ అధికారుల దాడులు
W.G: భీమవరం పట్టణం ఇండస్ట్రియల్ ఏరియాలో విజిలెన్స్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సూర్య తేజ ఫుడ్స్ కంపెనీ తయారుచేస్తున్న బ్లూ బెర్రీ ఐస్ క్రీమ్ తయారీలో ఎక్స్‌పైరీ పాలు, కెమికల్స్‌ను వాడుతున్నట్లు విజిలెన్స్ అధికారి నాగేశ్వరరావు వెల్లడించారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.