కంటోన్‌మెంట్ ఎమ్మెల్యేకు వినతి

HYD: బొల్లారం డౌటన్ బజార్‌లోని అమరావతి కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ స్నేహ ఎన్‌క్లేవ్ వాసులు సోమవారం కంటోన్‌మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్‌ని కలిశారు. తమ కాలనీలోని పార్క్ ఏళ్లుగా ఉన్న సమస్యలపై వినతి పత్రం అందజేశారు. పార్క్‌ను అభివృద్ధి చేయాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి పార్క్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.