చికెన్ షాపులు బంద్ .. వ్యాపారుల నిరసన
MLG: ఏటూరునాగారం మండల కేంద్రంలో చికెన్ షాప్ యజమానులు నిరసనగా తమ షాపులను బుధవారం మూసివేశారు. పౌల్ట్రీ ఫార్ములు కమీషన్ కోసం అధిక ధరలకు కోళ్లను విక్రయిస్తున్నాయని వ్యాపారులు ఆరోపించారు. పెరిగిన ధరల వల్ల వ్యాపారం దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేస్తూ, సరఫరాదారులు న్యాయమైన ధరలకు కోళ్లను అందించాలని డిమాండ్ చేశారు. లేకపోతే నిరసనలు మరింత ఉద్ధృతం చేస్తామన్నారు.