స్పోర్ట్స్ స్కూల్ ఎంపిక పరీక్షలు
SDPT: హుస్నాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో మంగళవారం మండల స్థాయి స్పోర్ట్స్ స్కూల్ ఎంపిక పరీక్షలు నిర్వహించారు. ఎంఈవో మనీలా ఆధ్వర్యంలో 4వ తరగతి విద్యార్థులకు ఎత్తు, బరువు కొలతలతో పాటు షటిల్ రన్, 800 మీటర్ల పరుగు పందెం వంటి వివిధ క్రీడా విభాగాల్లో ప్రతిభను అంచనా వేసే పరీక్షలు నిర్వహించారు.