VIDEO: విగ్రహాలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే
KKD: ప్రత్తిపాడు గ్రామ పంచాయతీ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన డా. బీ.ఆర్. అంబేద్కర్, మహాత్మా గాంధీ, మదర్ థెరిసా విగ్రహాలను ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ రాజా ఇవాళ ఆవిష్కరించారు. ఆ మహనీయులు సమాజానికి చేసిన సేవలను స్మరించుకుని వారికి నివాళులు అర్పించారు. అనంతరం వారి ఆశయాలను నేటి తరం కొనసాగించాలన్నారు.