ఏలూరులో కట్టమంచి రామలింగారెడ్డి జయంతి
ఏలూరు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో డా. కట్టమంచి రామలింగారెడ్డి "145వ" జయంతిని వేడుకలను బుధవారం నిర్వహించినట్లు జిల్లా కేంద్ర గ్రంథాలయ ఉపగ్రంధ పాలకులు ఎ. నారాయణరావు తెలిపారు. ఈసందర్భంగా కట్టమంచి రామలింగారెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కట్టమంచి చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తిగా ప్రసిద్ధి చెందారన్నారు.