ఆకట్టుకున్న ఇంద్రజాల ప్రదర్శన

NZB: నిజామాబాద్ బాల్ భవన్ లో నిర్వహించిన ఇంద్రజాల ప్రదర్శన చిన్నారులను విశేషంగా ఆకట్టుకుంది. వేసవి శిక్షణ శిబిరంలో భాగంగా చిన్నారులను ఉత్సాహపరిచేందుకు ప్రముఖ మెజీషియన్ జాదు యుగంధర్ రంగనాథ్ ఆధ్వర్యంలో ఈ ఇంద్రజాల ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనలు చిన్నారులను ఆశ్చర్యపరిచే విధంగా చేశాయి.