ఉత్తమ పోలీస్ అధికారిగా.. టేకుమట్ల ఎస్సై

BHPL: టేకుమట్ల సబ్ ఇన్‌స్పెక్టర్ సుధాకర్ ఉత్తమ పోలీస్ అధికారిగా గుర్తింపు పొందారు. విధి నిర్వహణలో అంకితభావం, నేర నియంత్రణలో చురుకైన చర్యలు, ప్రజలతో సాన్నిహిత్యం కారణంగా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఆయనకు ప్రశంసా పత్రం అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, ప్రజా ప్రతినిధులు, పోలీస్ శాఖ వారు సుధాకర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.